Somireddy Chandramohan Reddy Fires on AP CID Officers: సీఐడీ అధికారులా వైసీపీ ప్రతినిధులా.. సోమిరెడ్డి ఆగ్రహం - ఏపీ సీఐడీ అధికారులపై సోమిరెడ్డి ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 5:00 PM IST
Somireddy Chandramohan Reddy Fires on AP CID Officers: సీఐడీ అధికారుల వైఖరిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సీఐడీ అధికారులా లేక వైసీపీ అధికార ప్రతినిధులా? అంటూ మండిపడ్డారు. విజయవాడ, హైదరాబాద్, దిల్లీలో ప్రెస్ మీట్లు ఎలా పెడతారని సోమిరెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానాలలో చెప్పకుండా ప్రెస్ మీట్ల ద్వారా ఏం చెప్పాలనుకున్నారని నిలదీశారు. మీరు న్యాయాధికారులా.. వైసీపీ దుష్ప్రచారకర్తలా అని ప్రశ్నించారు. 2016లోనే కేపీఎంజీ అనే అంతర్జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఒక కేస్ స్టడీగా తీసుకుని తమ నివేదికలో పేర్కొందన్నారు. ఆ రిపోర్టులో 6 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, 36 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుపై నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. అరెస్టుకు ముందు జగన్ నుంచి 5 సార్లు వివరణ తీసుకున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబును హఠాత్తుగా వచ్చి ఎందుకు అరెస్టు చేశారని.. వివరణ ఇచ్చేందుకు కూడా చంద్రబాబుకు సమయం ఇవ్వలేదని సోమిరెడ్డి గుర్తు చేశారు.