Snow fall:వంజంగి కొండల్లో మంచు అందాలు - అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న మంచు అందాలు
Snow fall: అల్లూరి సీతారామరాజు జిల్లా వంజంగి కొండల్లో మంచు అందాలను తిలకించేందుకు.. పర్యాటకులు బారులు తీరారు. వెండిమబ్బుల్లో భానోదయాన్ని వీక్షిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల కొండపైకి వాహనాల అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యాటకులు కొండపైకి ఆటోల్లో వెళ్లేందుకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST