Snake Halchal: ఉరవకొండలో పాము హల్చల్.. భయంతో స్థానికులు కేకలు.. - ఉరవకొండ లేటెస్ట్ న్యూస్
Snake Under The Bike Seat: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఓ బైక్ సీటు కింద పాము హల్చల్ సృష్టించింది. దీంతో ఆ ప్రాంతంలో స్థానికులు భయంతో వణికిపోయారు. పట్టణంలోని ఓ యువకుడు బ్రాహ్మణ వీధిలో ఉన్న తన బంధువుల ఇంటికి వద్దకు వచ్చి.. తిరిగి వెళ్లే సమయంలో వాహనంలో పాము కన్పించింది. దీంతో యువకుడు భయపడి.. బైక్ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. ఇది గమనించిన స్థానిక యువకులు.. ధైర్యం చేసి పామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సుమారు గంటపాటు ఆ సర్పాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. దీంతో చివరికి బైక్ సీటును విడదీసి.. శబ్ధాలు చేయటంతో పాము బయటకు వచ్చి.. పక్కనే ఉన్న చెరవులోకి వెళ్లిపోయింది. పామును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న సమయంలో చుట్టు పక్కల జనాలు పెద్ద ఎత్తున గుమిగూడి.. ఆసక్తిగా చూశారు. చివరికి పాము చెరువులోకి వెళ్లిపోవటంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.