ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rattlesnake_Entered_House_in_Rayuduvaripalem_of_Konaseema_District

ETV Bharat / videos

వంట గదిలోకి తాచుపాము - భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు - Konaseema District News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 10:09 PM IST

Snake Entered House in Rayuduvaripalem of Konaseema District : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగరపంచాయతీ పరిధిలో ఉన్న రాయుడువారిపాలెంలో తాచుపాము కలకలం రేపింది. ఓ ఇంట్లో పాము కనిపించడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వంట గదిలోకి ప్రవేశించిన పామును చూసి.. స్నేక్ క్యాచర్​కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చాకచక్యంగా పామును డబ్బాలో బంధించి సురక్షితంగా జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పొలం పనులు ముమ్మరంగా సాగుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అన్నదాతలు వివిధ పంటలు సాగు చేయటానికి తమ పొలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో రైతులు, కూలీలకు చాలా చోట్ల పాములు కనిపించటం సహజం. కొన్ని సార్లు పాముకాట్లకు గురవుతుంటారు. కానీ ప్రస్తుతం పాములు కనిపించే తీరే మారిపోయింది. పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంతో.. అక్కడ ముళ్లతుప్పలు, కంపచెట్లు పెరిగి పాములు సంచరించడానికి ఆవాసయోగ్యంగా మారుతున్నాయి. అంతేగాక ఇటీవల కాలంలో కాలువల గట్లు, గుబురు పొదలు, చెరువులు.. ఆక్రమణలకు గురి కావడంతో పాములు, ఇతర కీటకాలు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.

కొండచిలువ కలకల: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో కొండచిలువ కలకాలం సృష్టించింది గ్రామంలో నివాస గృహాలు ఉండే ప్రాంతంలో వరిగడ్డి వామి వద్ద ఒక్కసారిగా కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్థులు గ్రామంలో పాములు పట్టే వాళ్లని పిలిపించి.. కొండచిలువను బంధించి ముండ్లమూరు వద్ద అడవిలో వదిలి పెట్టినట్టు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details