ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Snake_at_Vijawada_Indrakeeladri

ETV Bharat / videos

ఇంద్రకీలాద్రి టిక్కెట్​ కౌంటర్​లోకి పాము - 'స్వయంగా చేతులతో తాకిన భక్తులు' - snake at vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 4:57 PM IST

Updated : Nov 30, 2023, 5:19 PM IST

Snake at Vijawada Indrakeeladri: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ పాము(Snake) కలకలం రేపింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు టిక్కెట్టు స్కానింగ్ కేంద్రం వద్ద పాము కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. టికెట్ కౌంటర్లోకి పాము వెళ్లడంతో అక్కడి సిబ్బంది భయంతో బయటకొచ్చారు. ఈ విషయాన్ని సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించి పరిశీలన చేయించారు. 

టిక్కెట్టు కౌంటరులో దాక్కున్న పాముని జాగ్రత్తగా పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. పామును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న సమయంలో చుట్టు పక్కల జనాలు పెద్ద ఎత్తున గుమిగూడి.. ఆసక్తిగా చూశారు. పామును కొండపైకి తీసుకెళ్లి వదిలేయడంతో భక్తులు, ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు.ఈ పాము విషపూరితం కాదని, దాని నుంచి కాన్సర్ మందులను, యాంటీ స్నేక్ వీనమ్(పాము కరిస్తే ఇచ్చే విరుగుడు మందు) తయారు చేస్తారని పామును పట్టుకున్న వ్యక్తి తెలిపారు. పాములను చంపొద్దని- వాటితో ఔషధాలు తయారవుతాయనే అవగాహన ప్రజలు పెంచుకోవాలంటూ వ్యక్తి వివరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పామును చేతులతో తాకి చూడడం కొసమెరుపు.

Last Updated : Nov 30, 2023, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details