Simhachalam Temple Dwaja Sthambam Gold Plating: అప్పన్న ఆలయంలో ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభం - Vizag News
Simhachalam Temple Dwaja Sthambam Gold Plating: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం పనులకు శుక్రవారం ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. సుమారు 155 ఏళ్ల చరిత్ర కలిగిన ధ్వజ స్తంభాన్ని 2016లో తొలగించి అప్పటి అధికారులు నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దానికి స్వర్ణతాపడం చేసేందుకు దాత ముందుకురాగా అప్పట్లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో పనులు నిలి చిపోయాయి. తిరిగి ఆలయ ధ్వజస్తంభంపై ఉన్న రాగి రేకులపై స్వర్ణతాపడం చేసేం దుకు ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.1.8 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతులు తీసు కోగా.. ఆ మొత్తం ఇచ్చేందుకు సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ముందుకొచ్చారు. ఈ మేరకు శ్రావణమాసపు తొలి శుక్రవారం పురస్కరించుకుని ఆలయ వైదికులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేయగా సీఎంఆర్ సంస్థ తరపున మాడా చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గతంలో అప్పన్న అంతరాలయ స్వర్ణ తాపడం పనులు చేసిన చెన్నైకు చెందిన సంస్థే ధ్వజస్తంభ తాపడం పనులు కూడా చేయనుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈఓ సుజాత, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహితుడు కరి సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.