Shops Closed in Srikalahasti Due to Minister Kottu Tour: 'మంత్రి వస్తున్నాడని.. షాపులు బంద్'.. శ్రీకాళహస్తిలో అధికారుల అత్యుత్సాహం - శ్రీకాళహస్తిలో అధికారుల అత్యుత్సాహం
Shops Closed in Srikalahasti Due to Minister Kottu Tour: శ్రీకాళహస్తిలో దేవాదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన సందర్భంగా.. ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాళహస్తికి మంత్రి వస్తున్నారని దుకాణాలు మూసివేయించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి ధర్మ ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు మంత్రి కొట్టు శ్రీకాళహస్తి వచ్చారు. అయితే మంత్రి రాకను ఆలయ అధికారులు గోప్యంగా ఉంచడంతోపాటు పలు ఆంక్షలు విధించారు. మంత్రి రాకతో ఉన్నట్లుండి దేవాలయ ఆవరణలోని దుకాణాలు మూసివేయించారు. దుకాణాల మూసివేతతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వ్యాపారాలు లేక దుకాణదారులు సైతం అవస్థలు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, అధికారులు దుకాణాలను శాశ్వతంగా తొలగిస్తారనే భయంతో గమ్మున ఉన్నామని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున భక్తుల నుంచి నిరసన ఎదురయ్యింది. ఆ కారణంతోనే మంత్రి పర్యటన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచినట్లు అక్కడ ప్రచారం జరుగుతోంది.