Lokesh on Viveka case అది జగనాసురా రక్త చరిత్రే..! షర్మిల కూడా తేల్చేసిందంటూ.. లోకేశ్ ట్వీట్! - YS Viveka murder case details
Viveka murder case: వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అబ్బాయే బాబాయిని చంపాడని లోకేశ్ పునరుద్ఘాటించారు. అది జగనాసుర రక్త చరిత్రే అని ఆయన చెల్లెలు షర్మిల కూడా తేల్చేసిందని తెలిపారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చు అంటూ షర్మిల వాంగ్మూలం కూడా ఇచ్చిందని ట్వీట్ చేశారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని పేర్కొనడంతో పాటు అవినాష్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబటమూ కారణంగా షర్మిల పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ స్పష్టం చేసింది. హత్య కుట్ర, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాల చెరిపివేత సహా పలు వివరాలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంది. వివేకా హత్య కేసులో సీఎం జగన్ సోదరి షర్మిల గతేడాది అక్టోబర్ 7న దిల్లీలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. సీబీఐ.. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు వాంగ్మూలం అందజేసింది. కాగా, తన వద్ద ఆధారాల్లేవుకానీ రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది.