SFI Rally With 75 Meters Flag స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. భారీ త్రివర్ణపతాకంతో విద్యార్థుల భారీ ర్యాలీ
SFI Rally With 75 Meters Flag in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు 77వ స్వాతంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ 75 మీటర్ల భారీ జాతీయ జెండాను పట్టుకొని స్థానిక చైతన్య కాలేజీ నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం విద్యార్థులంతా గాంధీ విగ్రహం చుట్టూ నిలబడి.. జాతీయ జెండాను పట్టుకొని దేశం కోసం వారి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ దేశానికి రాజకీయంగా స్వేచ్చ లభించింది తప్ప నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదని ఆయన అన్నారు. మణిపుర్లో కొందరు దుండగులు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన.. ఆ విషయం గురించి ప్రధానమంత్రి మోదీతో సహా దేశ నాయకులు ఎవరు నోరు విప్పట్లేదని ఆయన విమర్శించారు.