S.F.I Demand to Increase Mess Charges : మెస్ ఛార్జీలను రూ. 2వేలకు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ - Latest Vizianagaram News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 10:46 AM IST
S.F.I Demand to Increase Mess Charges : మెస్ చార్జీలను 2000 రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరంకోట వద్ద విద్యార్థులు బిక్షాటన చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాము ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరంలో 1200 రూపాయల ఉన్న మెస్ చార్జీలు ఇప్పుడు 1400 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.పెరుగుతున్న నిత్యావసర సరుకులకు అనుగుణంగా ఈ చార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు భర్తి చేయకపోవడం వల్ల సంక్షేమ హాస్టళ్లలో నిర్వహణ లోపం కనబడుతోందని తెలిపారు. హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడం వలన శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పెచ్చులూడి విద్యార్థుల మీద పడుతున్నాయని చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.