ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Sexual Harassment in sri satyasai district గాడి తప్పిన ఉపాధ్యాయుడు.. లైెంగిక దాడికి బలైన బాలిక.. - విద్యార్థినిపై ఉపాద్యాయుడి​ లైంగిక దాడి

🎬 Watch Now: Feature Video

Sexual Harassment in sri satyasai district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 4:45 PM IST

Sexual Harassment in  sri satyasai district : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థినిపై లైంగిక దాడికి  పాల్పడ్డాడు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో చోటుచేసుకుంది.  

teacher Sexual Harassment : తనకల్లు మండల కెంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే సమయంలో ఒక  విద్యార్థినికి ఉపాధ్యాయుడు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని విద్యార్థులని బెదిరించారు. పదో తరగతి పూర్తైన తర్వాత విద్యార్థిని జూనియర్ కళాశాలలో చేరింది. అప్పటికే బాలిక గర్భం దాల్చింది. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యార్థినికి పురిటి నొప్పులు రావడంతో, ఆమెను తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. విద్యార్థిని రక్తహీనతతో బాధపడుతున్నడంతో ఆమెను బ్లడ్ బ్యాంక్ సదుపాయం ఉన్న ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు బాలికను అనంతపురం లోని ఆసుపత్రికి తరలించారు.. అక్కడ మగ శిశువుకు జన్మనిచ్చింది.ఉపా ధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details