Sexual Harassment on Boy : గంజాయి మత్తులో.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి - Guntur district latest news
Sexual Harassment on Boy : ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు మహిళలపై ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ దీనికి భిన్నంగా సభ్యసమాజం తలదించుకునే ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేశాడు. ఈ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జరిగింది. బాలుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. స్థానిక ప్రైవేటు పాఠశాలలో బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల ముగిశాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన నాగిశెట్టి సంజయ్ పవన్(20) గంజాయి మత్తులో బాలుడిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు గమనించి గదిలోకి వెళ్లి జరిగిన సంఘటన చూసి ఆగ్రహంతో యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పొన్నూరు పట్టణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.