Sexual Harassment of Students: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ లైంగిక వేధింపులు.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు - AP Crime News
Sexual Harassment of Students: విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులు పైట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా వంగర మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బండి రాముడు సంవత్సర కాలంగా పాఠశాలలోని విద్యార్థినులు పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. టీచర్ వ్యవహారంతో విసిగిపోయిన విద్యార్థునిలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు కీచుకు ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బండి రాముడు గత కొన్ని రోజులుగా విద్యార్థులతో అసభ్యకరంగా ఫోటోలను తీసుకుంటూ వాట్సాప్ మెసేజ్లు పెట్టి వారిని మరింత వేధించడంతో విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకొని ఫోక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కీచక టీచర్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సైన్స్ ఉపాధ్యాయుడు బండి రాముడుని సస్పెండ్ చేసినట్లు విద్య శాఖ అధికారుల నుండి ఆదేశాలు వచ్చినట్లు ప్రధానోపాధ్యాయురాలు రవణమ్మ తెలియజేశారు.