ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Several Temples To Be Closed in AP

ETV Bharat / videos

Several Temples To Be Closed in AP పాక్షిక చంద్రగ్రహణం.. రాష్ట్రంలో మూతపడ్డ ఆలయాలు..! - చంద్రగ్రహణం వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 9:17 PM IST

 Several Temples To Be Closed in AP: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, ఏకాంత సేవ పూర్తి చేసుకొని రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిని ఆలయ అధికారులు మూసేశారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు రేపు ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి.

  నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని సాయంత్రం నాలుగు గంటలకు మూసివేశారు. తిరిగి ఆదివారం ఉదయం అయిదు గంటలకు తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సింహాచలం ఆలయ ద్వారాలను సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఆలయ అధికారులు మూసేశారు. అప్పన్న స్వామికి రాత్రి జరగవలసిన ఆరాధన, పవళింపు సేవను నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తలుపు తాత్కాలికంగా మూపడ్డాయి. శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని అధికారులు, అర్చకులు మూసివేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details