ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నటకిరీటి రాజేంద్రప్రసాద్

ETV Bharat / videos

సాయిబాబాని దర్శించుకున్న.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ - guntur news

By

Published : Mar 27, 2023, 9:39 AM IST

Actor Rajendra Prasad Visited the Saibaba Temple: సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో పర్యటించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో పెదవడ్లపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్య శిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ నిర్వహకులు దర్శన ఏర్పాట్లు చేసి.. రాజేంద్రప్రసాద్​కు సాయిబాబా తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గోసేవలో పాల్గొన్న ఆయన గోశాలలోని ఆవులకు అరటిపండ్లు తినిపించారు. 20 ఏళ్ల కిందట ఆలయ నిర్మాణ సమయంలో బాబాను సందర్శించుకున్నానని తెలిపారు. గత 20 ఏళ్లుగా విజయవాడ - తెనాలి మార్గంలో వెళ్లే ప్రతీసారి గ్రామంలోని సాయిబాబా ఆలయానికి రావటం ఆనవాయితీగా మారిందన్నారు. సాయిబాబాని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఆలయ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు నటకిరీటి రాజేంద్రప్రసాద్​ను సత్కరించి.. జ్ఞాపికను అందించారు. 
 

ABOUT THE AUTHOR

...view details