దర్గాలో వీరంగం సృష్టించిన యువకులు - దాడిలో గాయపడ్డ దర్గా సిబ్బంది - youth attack on security gaurds at dargah
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 12:22 PM IST
Security Gaurds are Injured on Youth Attack in Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. దర్గా ఈవో, పలువురు సిబ్బందిపై దాడి చేసిన యువకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
Youth Attacked Dargah Staff are in Police Custody: రహమతాబాద్ దర్గా ఆవరణలో మహిళలు ఉన్న చోట హైదరాబాదుకు చెందిన కొందరు యువకులు నిలబడి ఉన్నారు. యువకులను పక్కకు వెళ్లాలని దర్గా సిబ్బంది సూచించారు. వారు పక్కకు వెళ్లకుండా దర్గా సిబ్బందితో వాదనకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. అక్కడే ఉన్న దర్గా ఈవో మొహమ్మద్ హుస్సేన్ కలగజేసుకోవడంతో అతని పైనా ఆ యువకులు తిరగబడ్డారు. ఆ గొడవ కాస్త పెద్ద అవడంతో ఏకంగా ఈఓ మహమ్మద్ హుస్సేన్‌తో పాటు దర్గా సిబ్బందిపై యువకులు దాడి చేశారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఓ ఫిర్యాదు మేరకు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువకుల దాడిలో గాయపడిన ముగ్గురు దర్గా సెక్యూరిటీ గార్డులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.