ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్కార్పియో వాహనం దగ్ధమైంది

ETV Bharat / videos

స్కార్పియోలో చెలరేగిన మంటలు.. వాహనం దగ్ధం.. వీడియో వైరల్

By

Published : Mar 21, 2023, 7:11 PM IST

 ఒడిశా వైపు వెళ్తున్న ఓ స్కార్పియో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎటపాక మండలం గుండాల జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఆరుగురు వ్యక్తులతో భద్రాచలం నుంచి ఒడిశా రాష్ట్రం వైపు వెళుతుండగా స్కార్పియో వాహనం ఇంజన్ నుంచిఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. డ్రైవర్ అందరినీ స్కార్పియో వాహనం నుంచి బయటకు దించాడు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. వారి ప్రయత్నం విఫలం అయింది. వాళ్లందరూ ప్రాణాలను కాపాడుకోవడానికి వాహనానికి దూరంగా పరుగులు పెట్టారు. ఒక్కసారిగా వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ స్కార్పియో మంటల్లో ఆహుతై పోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారెవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు కారును తమ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details