ఆంధ్రప్రదేశ్

andhra pradesh

School Buses For CM Jagan meeting

ETV Bharat / videos

సీఎం పర్యటన కోసం స్కూళ్లకు సెలవా!- విద్యార్థి సంఘాల ఆగ్రహం - పుట్టపర్తిలో పర్యటించనున్న జగన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 4:19 PM IST

 School Buses For CM Jagan meeting: సీఎం జగన్ ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నారంటే చాలు... అధికారులు భద్రత పేరుతో  చెట్లను నరికేయడం, ట్రాఫిక్ ఆంక్షలు పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిపోయింది. కానీ, ఆ ప్రభావం తాజాగా విద్యావ్యవస్థపై కూడా పడింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం (7వ తేదీ) ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. సీఎం జగన్  వస్తున్న సందర్భంగా... అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

ముఖ్యమంత్రి పర్యటన కోసం ప్రైవేట్ పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకొని.. ఆయా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై  విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ పర్యటన అంటే చాలు స్కూళ్ల​కు సెలవులు ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించడాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్ పర్యటనను అడ్డుకుంటామని, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాధికారులను హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details