SC ST Commission Chairman visited the woman injured in the YCP leader attack వైసీపీ నేత దాడిలో గాయపడ్డ మహిళలను పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ - YCP leaders Anarchy
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 6:33 PM IST
SC ST Commission Chairman visited the woman injured in the YCP leader attackదొంగతనం చేశారన్న అభియోగంతో వైసీపీ నేత, ఎస్సై కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మహిళలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ పరామర్శించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో ముగ్గురు మహిళలు దొంగతనం చేశారనే అనుమానంతో మోపిదేవి ఎస్సై పద్మ, వైసీపీ నేత రాజాచంద్ ముగ్గురు మహిళలను తీవ్రంగా గాయపరిచారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం ముగ్గురు మహిళలను తీవ్రంగా గాయపరిచిన మోపిదేవి ఎస్సై పద్మ, నిందితుడు రాజాచంద్తో పాటు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు అధికారులకు సూచించారు. ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.