Satyameva Jayate Deeksha in London: చంద్రబాబు కోసం.. లండన్ పార్లమెంట్ ముందు 'సత్యమేవ జయతే' - బాబు కోసం సత్యమేవ జయతే దీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 8:05 PM IST
Satyameva Jayate Deeksha in London: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... విదేశాల్లో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు.. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిరసనగా... నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షకు సంఘీభావంగా... లండన్ పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద.. చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు "సత్యమేవ జయతే దీక్ష" చేపట్టారు. బాబుకు మద్దతుగా యూకేలో చేపట్టిన నిరసనకు.. భారత రాయబారి దొరైస్వామి, స్థానిక భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ సంఘీభావం తెలిపారు. టీడీపీ, జనసేన అభిమానులు.. మిన్నియాపోలిస్, మిన్నెసోటా, ఫిలదెల్ఫీయా, డెట్రాయిట్ లలో ఆందోళనలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ అక్రమం అని పేర్కొన్నారు. తమ మద్దతు చంద్రబాబుకు ఉంటుందని.. ఆయన జైలు నుంచి బయటికి వచ్చే వరకూ... వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.