వాడివేడిగా కడప జిల్లా సర్వసభ్య సమావేశం - కరువు మండలాల ప్రకటనపై టీడీపీ అభ్యంతరం, గొంతు కలిపిన వైసీపీ సభ్యులు - TDP MLC Ramgopal reddy comments in kadapa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 3:39 PM IST
Sarva Sabhya Samaavesam in Joint Kadapa District: కడప జిల్లాను కరవు మండలంగా ప్రకటించకపోవడానికి కారణం అధికారుల తప్పిదమా లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా అని టీడీపీ ఎమ్మెల్సీ(TDP MLC) రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కరవు మండలాలను ప్రకటించడం వల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయం అందుతాయని, కడప జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది.
TDP Leaders Angry Over not Declaring Kadapa District as Drought Zone: ఉమ్మడి కడప జిల్లాలో zp సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. కడప జిల్లాలో ఒక్క ప్రాంతాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు కూడా కడప జిల్లాను కరవు మండలంగా ప్రకటించాలని కోరినా టీడీపీ ఎమ్మెల్సీ ప్రస్తావిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలియజేశారు.చంద్రబాబు, లోకేష్ వల్లే రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఎదురుదాడి చేశారు. దీంతో కాసేపు ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి జడ్పీ చైర్మన్ ఆకేపాటీ అమర్నాథరెడ్డి కరువు జిల్లాగా ప్రకటించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.