Sarpanchi Pitala Buchibabu protest : పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం: సర్పంచి బుచ్చిబాబు - Buchibabu protest
Sarpanchi Pitala Buchibabu protest : రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తే.. పంచాయతీలను నిర్వీర్యం చేసి పాలనను అస్తవ్యస్తం చేశాడని తాడేపల్లిగూడెం మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు పీతల బుచ్చిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నందుకు నిరసనగా జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనలో భాగంగా బుచ్చిబాబు చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీలో తనకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీల మద్దతుతో గెలిచానన్నారు. పదేళ్ల పాటు భార్యాపిల్లలు, వ్యాపారాలు వదులుకుని జగన్ సీఎం కావాలని పనిచేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందంటూ చెప్పుతో పదే పదే కొట్టుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి అడ్డుకుని బుచ్చిబాబును సముదాయించారు. నేను చేసిన తప్పుకు దేవుడు కూడా క్షమించడు. చాలా పెద్ద తప్పు చేశాను. ప్రజలను క్షమాపణ కోరుతున్నానంటూ సర్పంచి పీతల బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.