Sarpanches Demand: పంచాయతీ నిధులు విడుదల చేయకపోతే ఉద్యమిస్తాం: సర్పంచులు - ఏపీలో సర్పంచ్‌లు సమావేశం
Sarpanches Demand: పంచాయతీ నిధులను ప్రభుత్వం సొంత పథకాల కోసం వాడుకుంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలకు రావాల్సిన నరేగా నిధులను నేటికీ జమ చేయలేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై చలో దిల్లీ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి ప్రధాని, కేంద్ర మంత్రులకు సైతం ఫిర్యాదు చేస్తామని.. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఉపాధి హామీ నిధులు గతంలో మాదిరిగా గ్రామపంచాయతీలకు ఇచ్చి మా సర్పచుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మా గ్రామాల్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేనిచో రాజకీయాలకు అతీతంగా సర్పంచులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. -వైవీబీ రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు పంచాయతీరాజ్ ఛాంబర్
ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం.. రాష్ట్ర నిధులను కేెెంద్రం ముట్టుకుంటే మీరు ఊరుకుంటారా..? మరి మా నిధులను మీరు ముట్టుకుంటే మేము ఎందుకు ఊరుకోవాలి ? మా నిధులకు మాకు విడుదల చేస్తే మా గ్రామాలన్నీ బాగు చేసుకుంటాం-లక్ష్మీ ముత్యాలరావు, అధ్యక్షురాలు రాష్ట్ర సర్పంచుల సంఘం