అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్ తిట్లదండకం - అధికార పార్టీ నేత కావడంతో నిస్సహాయ స్థితిలో పోలీసులు - Panchayat funds in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 10:54 PM IST
Sarpanch Questioned Officials and YCP Leaders in General Meeting:అన్నమయ్య జిల్లా చిట్వేల్లో మండల స్థాయి సర్వసభ్య సమావేశంలో అధికారులను, వైసీపీ నాయకులను రాజుగుంట సర్పంచ్ ఏ సమస్యల గురించి చెప్పినా పట్టించుకోవట్లేదని నిలదీశారు. మేము గ్రామంలో తిరగలేకుండా ఉన్నామంటూ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజుగుంట సర్పంచ్ నరసింహ తమ పంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరములుగా ఏ పని చేయలేదంటూ మండల స్థాయి అధికారులను, వైసీపీ నాయకులను నిలదీశారు. అధికారులకు విన్నవించినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేని సమయంలో తాగునీటి కోసం చిన్న హ్యాండ్ పంపు కూడా రిపేరు చేయలేని స్థితిలో ఉన్నామని, పంచాయితీ నిధులు లేక గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు విద్యుత్ దీపాలు వంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేకుండా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్థాయి మీటింగ్లో ఎన్నిసార్లు చెప్పినా రేపు చేస్తాం ఈవేళ చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారే గాని గ్రామంలో ఏ పని చేయలేదన్నారు. గత నాలుగేళ్లుగా పంచాయతీల నిధులు లేక గ్రామంలో ఏ పని చేయాలన్నా తమ సొంత నిధులతో చేసే దౌర్భాగ్యం ఈ వైసీపీ ప్రభుత్వంలో వచ్చింద అన్నారు.