ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sarpanch_Protest_in_Haridasu_Getup

ETV Bharat / videos

'హరిలో రంగ హరి పంచాయతీ నిధులు హరీ' - హరిదాసు వేషధారణలో సర్పంచ్ భిక్షాటన - sankranti

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 5:08 PM IST

Sarpanch Protest in Haridasu Getup: 'హరిలో రంగ హరి' అంటూ సంక్రాంతి పండుగకు హరిదాసులు ఇంటింటికీ తిరగటం అందరూ చూసే ఉంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం హరిలో రంగ హరి అంటూ సర్పంచ్ ప్రతి ఇంటికి తిరిగి భిక్షాటన చేశారు. ప్రభుత్వం ఆర్ధిక సంఘం నిధులు తీసుకోవడంపై హరిదాసు వేషధారణలో నిరసన తెలిపారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో సర్పంచ్ శివశంకర్ హరిదాసు వేషధారణలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 600 కోట్లను ప్రభుత్వం దొంగిలించిందని, వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాట్రపాడులో 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1198 మాత్రమే ఇచ్చారన్నారు. ఆ డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. గ్రామంలో కనీసం వీధి లైట్ వేసేందుకు నిధులు లేని దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు కూడా తెలియజేయాలని గ్రామ వీధుల్లో వార్డు సభ్యులతో కలిసి భిక్షాటన చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details