ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రమంత్రిని కలిసిన సర్పంచ్‌ల సంఘం

ETV Bharat / videos

Sarpanch Association Met Central Minister: నిధుల మళ్లింపు.. కేంద్రమంత్రికి సర్పంచుల సంఘం ఫిర్యాదు

By

Published : Aug 2, 2023, 5:10 PM IST

Sarpanch Association Met Central Minister: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సర్పంచుల సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల నేతృత్వంలో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ పాటిల్‌ను కలిసిన సర్పంచ్‌లు.. సంతకాలు లేకుండా రూ. 8 వేల 660 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 12 వేల 998 పంచాయతీల్లో కరెంటు బిల్లుల పేరుతో నిధులు మళ్లించుకున్నారన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు  ఫిర్యాదు చేయడంతో పాటు.. నరేగా నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనివ్వట్లేదని తెలిపారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని.. కేంద్రానికి అన్ని అంశాలు వివరించినట్లు సర్పంచుల సంఘం నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. సర్పంచుల విధులను, హక్కులను లాగేసుకుని.. ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలను చేసిందని.. ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి అన్నారు. సర్పంచుల హక్కులను సాధించేవరకూ పోరాడతామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details