ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sankranti_Celebrations_in_Naravaripalli

ETV Bharat / videos

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు - పాల్గొన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు - nandamuri tejaswini

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 9:56 PM IST

Updated : Jan 15, 2024, 6:41 AM IST

Sankranti Celebrations in Naravaripalli: తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలకు రంగంపేట నుంచి నారావారిపల్లె వరకు రోడ్డుకి ఇరువైపులా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు ఇక్కడకు చేరుకుని పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నారా భువనేశ్వరి, మనువడు దేవాన్షు, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, లోకేశ్వరి ఇతర కుటుంబసభ్యులు శుక్రవారమే గ్రామానికి చేరుకున్నారు. ఇవాళ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. 

భోగి సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లెలో ముగ్గుల పోటీ నిర్వహించారు. గ్రామంలో మహిళలు పాల్గొని వేసిన రంగవల్లులను బాలకృష్ణ సతీమణి వసుంధర, రెండో కుమార్తె తేజస్వినితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఆకర్షణీయంగా ఉన్న రంగవల్లులకు బహమతులు అందజేశారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి గొబ్బిళ్లమ్మ గొబ్బిళ్లు అంటూ పాట పాడుతూ పాదం కలిపారు. భోగి మంటల్లో ప్రభుత్వ చీకటి ఉత్తర్వులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం నారావారిపల్లికి చేరుకున్నారు. ఈసారి సందర్శకుల తాకిడి అధికంగా ఉండటంతో భోజన వసతి, వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం కేటాయింపుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.  

Last Updated : Jan 15, 2024, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details