Samineni photographer: మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ.. విప్ ఉదయభాను వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ - జగ్గయ్యాపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
Samineni Udayabhanu personal photographer caught smuggling illegal liquor : తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ... ప్రభుత్వ విప్ జగ్గయ్యాపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గోపి ఎస్ఈబి అధికారులకు పట్టుబడ్డారు. గరికపాడు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు దొరికాడు. హోండా యాక్టివా వాహనంలో తరలిస్తున్న 127 మద్యం సీసాలను చెక్ పోస్ట్ ఎస్ఈబి పోలీసు సీఐ శ్రీహరి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం ప్రకారం బలుసుపాడు గ్రామానికి చెందిన అమ్మనబోయిన గోపాలరావు అలియాస్ గోపి తెలంగాణ నుంచి ఈ మద్యం బాటిల్స్ తీసుకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 90 ఎంఎల్, 180 ఎంఎల్ పేరు మోసిన, విలువ గల కంపెనీల బ్రాండ్లకు చెందిన 127 మద్యాం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. పట్టుకున్న వాహనాన్ని, మద్యం సీసాలను, నిందితుడు గోపిని జగ్గయ్యపేట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యాలయానికి పోలీసులు తరలించారు. పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.