ఆంధ్రప్రదేశ్

andhra pradesh

samatha_sainik_dal

ETV Bharat / videos

Samatha Sainik Dal comments on Jagan: మేనమామను అని చెప్పుకునే జగన్.. ఎస్సీ, ఎస్టీల నడ్డి విరుస్తున్నాడు: సమతా సైనిక్ దళ్ - Jagan injustice to SC and ST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 5:02 PM IST

Samatha Sainik Dal comments on Jagan:ఎస్సీ, ఎస్టీలకు మామను అని చెప్పుకునే సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీల నడ్డి విరుస్తున్నాడని సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. సమతా సైనిక్ దళ్ 99వ వార్షికోత్సవాన్ని విజయవాడ ఐలాపురం హోటల్​లో నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అణగారిన వర్గాలకు గతంలో లబ్ధి జరుగుతున్న 27 పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మహేశ్వరరావు అరోపించారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తెస్తున్నామని పబ్లిసిటీ ఇచ్చుకుంటున్న ప్రభుత్వం.. ఆ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా పెట్టి అమ్ముకుంటోందని ఆరోపించారు. ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య విద్యను చదివే పరిస్థితి దళితులకు లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం నిలిపేశారన్నారు. భూమి కొనుగోలు పథకం రద్దు చేయటం ద్వారా ఎస్టీ, ఎస్సీలు భూములు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలను లెక్క చేయని స్థితిలో అధికారులునన్నారని తెలిపారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోట్లేదని ఆయన ప్రశ్నించారు. దళిత బిడ్డలపై ఈ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details