షర్మిల వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు: సజ్జల - కాంగ్రెస్‌లో షర్మిల చేరిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 5:29 PM IST
Sajjala Ramakrishna Reddy Sensational Comments: షర్మిల కాంగ్రెస్‌లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. ఆమె కారణంగా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని సజ్జల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమన్నారు.
అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా అస్త్రం ప్రయోగించడం సరైందేనని సజ్జల తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన వారి ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారని అన్నారు. విధుల్లో చేరాలని అంగన్వాడీలకు పలుసార్లు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అంగన్వాడీలు ధిక్కరించారన్నారని ఆరోపించారు. అందుకే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించినట్లు సజ్జల తెలిపారు.
"షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. షర్మిల రాజకీయంగా ఎక్కడినుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. ఆమె వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. అలాంటి పార్టీని మేం పట్టించుకోం. దీంతోపాటు అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సరైందే. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కింద ఉన్నారు. విధుల్లో చేరాలని అంగన్వాడీలకు పలుసార్లు విజ్ఞప్తి చేయగా వారు ధిక్కరించారు. అందుకే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం." - సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు