ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్

ETV Bharat / videos

Sajjala on Avinash Reddy: 'సీబీఐ పట్టుదలగా ఉంటే.. అవినాష్ ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు?'

By

Published : May 19, 2023, 9:09 PM IST

Sajjala Ramakrishna Comments on Avinash Reddy: వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వారిని సీబీఐ వేధిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బాధ్యత గల ఎంపీగా సీబీఐకి సహకరిస్తున్నా ఇలా చేయడం సరైంది కాదన్నారు. సీబీఐ ముందు విచారణకోసమే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారని, ఊహించని పరిణామంతో తన తల్లి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ రెడ్డి పులివెందుల బయలుదేరారన్నారు. సీబీఐ ముందు సాక్ష్యం చెప్పడానికి పిలిచి 5-6 సార్లు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లారని, మరోసారి సీబీఐ విచారణకు వెళ్లేందుకూ అవినాష్ రెడ్డి సిద్దమన్నారు. అవినాష్ రెడ్డి ని సీబీఐ అరెస్టు చేస్తారనే వార్తలు ఊహాజనితాలేనని అన్నారు. అవినాష్ రెడ్డి పారిపోతున్నట్లు చిత్రీకరిస్తున్నారని.. తల్లికి అనారోగ్యం ఉందని క్రియేట్ చేసేంత దౌర్భాగ్యం అవినాష్​కు లేదన్నారు. అవినాష్ కారు వెనుక వెళ్లే మీడియాపై దాడి జరగడం దురదుష్టకరమని.. అలా జరగకూడదని.. దాడి విషయం అవినాష్​కు తెలిసి ఉండకపోవచ్చన్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా మీడియా వెంబడించిందని ,అవినాష్ రెడ్డిని నేరస్తుడుగా చూపే ప్రయత్నించడం సరికాదన్నారు. వివేకానందరెడ్డిని నరికినోడేమో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. బయట తిరుగుతున్నారన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని,ఆ లోపు వ్యక్తిత్వ హననుం చేయడం సరైంది కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details