Sajjala comments on BJP leaders: అవినీతి జరిగితే నిరూపించండి.. బీజేపీ అగ్రనేతలకు సజ్జల సవాల్ - AP Latest News
Sajjala Ramakrishna Reddy comments on BJP leaders: రాష్ట్రానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు అసందర్బంగా.. ఎవరో స్క్రిప్టు రాసిస్తే దాన్ని చదివినట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవినీతి జరిగిందంటోన్న వారు.. అది ఎలా జరిగిందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందంటూ ఏదో ఊరికే మాట్లాడితే లాభమేముంది.. దాన్ని నిరూపించాలని అన్నారు. రాష్ట్రంలో పథకాలకు నిధులన్నీ డీబీటీ ద్వారా పారదర్శకంగా లబ్దిదారులకు అందుతున్నాయని.. సీఎం పాలనలో ప్రతీ దాంట్లో పారదర్శకత, సోషల్ ఆడిట్ ఉందన్నారు. రాష్ట్రంలోని జగన్ పాలన దేశానికే రోల్ మోడల్‌గా ఉందని కేంద్రం నుంచి వచ్చిన మంత్రులే అంటున్నారని అన్నారు. రాష్ట్రం దేశంలో భాగం.. కానీ దేశానికి రాష్ట్రం ఏమీ సంబంధం లేదన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం నుంచి పన్నులు కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తాయని.. అంతేకానీ రాష్ట్రానికి కేంద్రం ఇస్తోన్న నిధులు వారి జేబుల్లోంచి ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.