ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాయిధరమ్‌తేజ్‌

ETV Bharat / videos

Sai Dharam Tej Eluru Visit: ఏలూరు జిల్లాలో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న హీరో సాయిధరమ్‌ తేజ్‌ - సాయిధరమ్​తేజ్ ఏలూరు పర్యటన

By

Published : Aug 2, 2023, 7:53 PM IST

Sai Dharam Tej Eluru Visit: ఏలూరు జిల్లాలో పలు పుణ్యక్షేత్రాలను హీరో సాయిధరమ్‌ తేజ్‌ సందర్శించారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించుకుని పూజలు చేశారు. పాదుక మండపం వద్ద ఉన్న స్వామి వారి పాదాలకు నమస్కరించి మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు సాయిధరమ్‌ తేజ్​కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.  స్వామి అమ్మవార్లకు హీరో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కుబడులు చెల్లించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.  అదే విధంగా జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెంలో కొలువై ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల విడుదలైన 'బ్రో' చిత్రం విజయం సాధించడంతో హీరో సాయిధరమ్‌ తేజ్‌, చిత్ర బృందం స్వామివారికి తమలపాకులతో అష్టోత్తరం నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయిధరమ్‌తేజ్‌ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండింతులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ను చూసేందుకు స్థానికులు, భక్తులు పోటీ పడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

ABOUT THE AUTHOR

...view details