ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tc_buses_diverted_from_bus_stand_in_kadapa

ETV Bharat / videos

సీఎం జగన్​ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా? - కడపలో సీఎం పర్యటన ఆంక్షలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 2:36 PM IST

RTC Buses Diverted From Bus Stand in Kadapa: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి పర్యటన సందర్భంగా సామన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆయన పర్యటన ఉందంటే చాలు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చివరకి ఈ ఆంక్షల విధింపు ఏ స్థాయికి చేరిందంటే చివరకి ఆర్టీసీ బస్టాండ్​లోకి బస్సులు వెళ్లకుండా చేసి దారి మళ్లించే వరకు. అంతేకాకుండా సీఎం వస్తున్నారని పరదాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

కడప నగరంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి శనివారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్​లోకి బస్సులు రాకుండా అధికారులు దారి మళ్లించారు. పలు జిల్లాల నుంచి కడపకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్​ చేసిన స్థలాల్లోనే ఆగిపోతున్నాయి. బస్టాండ్​లోకి బస్సులు రావనే విషయం తెలియక చాలామంది ప్రయాణికులు బస్టాండ్​ ప్రాంగణానికి వచ్చి వెనుతిరుగుతున్నారు. శివారు ప్రాంతాల్లో బస్సులు నిలిపివేయడంతో అక్కడికి చేరుకోవడానికి ప్రైవేేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల అధిక ఛార్జీలు వెచ్చించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కడప ఆర్టీసీ బస్టాండ్​ నిర్మానుష్యంగా మారిపోయింది. కడప నగరంలోని అంబేద్కర్ కూడలి, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ల కూడలిని ఇటీవల నూతనంగా అభివృద్ధి చేశారు. శనివారం ముఖ్యమంత్రి వాటిని ప్రారంభించనున్నారు. అయితే ఉదయం నుంచే ఆర్టీసీ అధికారులు నగరంలోకి బస్సులు రాకుండా నిలిపివేశారు. 

ABOUT THE AUTHOR

...view details