ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RTC_Bus_Stucked_Near_Jammalamadugu

ETV Bharat / videos

RTC Bus Stucked Near Jammalamadugu: ఇసుక వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులను కాపాడిన పోలీసులు - RTC bus stuck in sand stream

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 1:58 PM IST

RTC Bus Stucked Near Jammalamadugu :రాష్ట్ర వాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. ఈ తరుణంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను పోలీసులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్ జిల్లాలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది.  వంకలు వాగులు ఏకమయ్యాయి. కర్నూలు వైపు నుంచి జమ్మలమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ఉదయం 4 గంటలకు జమ్మలమడుగు మండలం ఎస్‌.ఉప్పలపాడు వద్ద ఇసుక వాగులో చిక్కుకుంది. లోతు తెలియక ఆర్టీసీ బస్సును నీటిలో దింపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు ద్వారా సమాచారం తెలుసుకున్న జమ్మలమడుగు పట్టణ సీఐ సదాశివయ్య తమ సిబ్బందితో హూటాహూటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయ చర్యలు చేపట్టారు. బస్సులోని 13 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు (Police Saved Passengers) సురక్షితంగా కాపాడారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details