RTC Bus Plunges into Irrigation Canal: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం..! - ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 10:48 PM IST
RTC Bus Plunges into Irrigation Canal: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలోఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు కె. జగన్నాధపురంలో సమీపంలోకి రాగానే అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన బస్సులో ప్రయాణికులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన బస్సు మురముళ్ల నుంచి రావులపాలెం వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
రోడ్లు అధ్వానంగా ఉండడంతో బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రయాణికులు వెల్లడించారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు, 108 సిబ్భంది ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.