ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rs.90 lakhs_value_Fake_Cigarettes_Seized

ETV Bharat / videos

Rs 90 Lakhs Value Fake Cigarettes Seized in Vijayawada: బిహార్​ నుంచి విజయవాడకు రూ.90 లక్షల విలువైన నకిలీ సిగరెట్లు.. స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 5:38 PM IST

Rs 90 Lakhs Value Fake Cigarettes Seized in Vijayawada: విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద బిహార్ నుంచి కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని  పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోగా.. మరొకరు పరారిలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 గోల్డ్ ఫ్లాక్ బ్రాండ్ సిగరెట్​తో పోలి ఉండే విధంగా గోల్డ్ విమల్(Fake brand cigarette) పేరుతో సిగరెట్లను బిహార్​లో తయారు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. పక్కా సమాచారం ఆధారంగా విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బిహార్​ నుంచి వస్తున్న కంటైనర్​ను తనిఖీ చేయగా.. గోల్డ్ విమల్ పేరుతో ఉన్న సిగరెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. వాటికి సరైన రశీదులు, క్వాలిటీ తనిఖీలు, తయారీదారుల సమాచారం లేకుండానే రవాణా చేస్తున్నారని స్వాధీనం చేస్తుకున్నారు. వీటిని భవానీపురంలోని వెంకట్ అనే వ్యాపారికి పంపిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. ప్రస్తుతం వెంకట్ అసిస్టెంట్, డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ, నకిలీ బ్రాండెడ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. భవానీపురం, వన్ టౌన్ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details