Round Table Meeting on Irrigation Projects నీటి పారుదలకు అతి తక్కువ ఖర్చు పెడుతుంది జగన్ సర్కారే: జనచైతన్యవేదిక - జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 8:58 PM IST
Round Table Meeting on Irrigation Projects: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడి, ప్రజల జీవన ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా సాగునీటి రంగ నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ, వెలుగొండ ప్రాజెక్టులు పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం గురించి చర్చించారు. పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని, వ్యవసాయం లేక వలసలు పోతున్నారని, గత నాలుగేళ్లుగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు కూడా వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో సాగునీటి పథకాలకు నిధులు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ పార్టీల నేతలు, రైతు నాయకులు హాజరయ్యారు.
TAGGED:
jana chaitanya vedika