ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అర్ధరాత్రి భారీ దారి దోపిడీ

ETV Bharat / videos

Robbery In Vizianagaram: విజయనగరంలో భారీ దారి దోపిడీ.. రూ.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు - వాహనం ఆపి 50 లక్షలు దోచుకెళ్లారు

By

Published : May 31, 2023, 1:39 PM IST

Massive Robbery In Vizianagaram : విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి భారీ దారీ దోపిడీ జరిగింది. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు పూసపాటిరేగ పీఎస్‌ పరిధిలోజాతీయ రహదారిపై కారులో కోట్ల వంశీ కృష్ణ బియ్యం వ్యాపారం నిమిత్తం తన స్వగ్రామం నుంచి బయటదేరాడు. రెండు ద్విచక్ర వాహనాల్లో గుర్తు తెలియని నగుగురు వ్యక్తులు జాతీయ రహదారిపై కారును అడ్డుకున్నారు. బియ్యం వ్యాపారి వద్ద ఉన్న 50 లక్షల రూపాయలను దొంగిలించారు. బాధితుడు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ దండగులు ఎవ్వరికి దొరకకుండా అక్కడి నుంచి పరారయ్యారు. 

అనంతరం బాధితుడు దగ్గరలో ఉన్న పూసపాటిరేగ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేరారు. తనది ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి అని, బియ్యం కొనుగోలు కోసం పర్లాకిమిడి నుంచి విశాఖపట్నంకు వెళ్తున్న క్రమంలో ఈ దొంగతనం జరిగిందని పోలీసులకు వివరించారు.  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దుండగులను గాలిస్తున్నట్లుగా ఎస్సై నరేష్ తెలిపారు. ఈ క్రమంలోనే డీఎస్సీ గోవిందరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటనపై ఆరా తీసి సమీప సీసీ ఫుటేజ్​లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details