Robbery In Anantapur District : ఓ గదిలో నిద్రిస్తుండగా.. మరో గదిలో చోరీ..! గంటలో రూ.లక్షలు అపహరించిన దొంగలు - అనంతపురంలో 10 లక్షల దొంగతనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 12:13 PM IST
Robbery In Anantapur District :అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. కుటుంబ సభ్యులు ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తుండగానే మరో గదిలో బీరువాతాళం పగలగొట్టి రూ.10 లక్షలు, బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం 2 గంటల నుంచి 3 మధ్యలో జరిగి ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పట్టణంలోని శనగల వ్యాపారి గోపాల్ రెడ్డి అర్ధరాత్రి శనగల లారీ లోడు రావడంతో, భార్య ఇంట్లో నిద్రిస్తుండగానే ఇంటికి బయట నుంచి తాళం వేసి సరుకు అన్లోడ్ చేయించడానికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు అతను బయటికి వెళ్ళగానే ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
Huge Amount Theft In One Hour : అతడి భార్య గదిలో నిద్రిస్తున్న సమయంలోనే ఇంకో గదిలో బీరువాలో ఉన్న పది లక్షల రూపాయల నగదు తాళం పగులగొట్టి ఎత్తుకెళ్లారు. సరిగ్గా ఒక గంటలోనే పని ముగించుకొని ఇంటికి వచ్చిన గోపాల్‌రెడ్డి దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.