ఆంధ్రప్రదేశ్

andhra pradesh

roads_problem_in_anakapally_district

ETV Bharat / videos

అధ్వానంగా అనకాపల్లి రోడ్లు - గుంతల్లో ప్రయాణం - ప్రాణాలతో చెలగాటం - ఆంధ్రప్రదేశ్​ రోడ్ల సమస్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 1:19 PM IST

Roads Problem In Anakapally District :అనకాపల్లి జిల్లాలోని రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడి ఆధ్వానంగా తయారయ్యాయి. నాలుగేళ్లల్లో ఒక్కసారి కూడా ఆ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. అనకాపల్లి -అచ్యుతాపురం రోడ్డులో వెళ్లాలంటే ప్రయాణీకులు, వాహనదారులు నరకాన్ని చూస్తున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం కూడలిని అనుసంధానం చేస్తూ పూడిమడక, మునగపాక మీదుగా 30కిలోమీటర్ల మేర రహదారి ఉంది. దారి పొడుగునా రెండు అడుగుల లోతు గుంతలు ఏర్పడి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

Poor Condition Of Roads in Atchutapuram : ఇక వర్షం వస్తే చాలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. ఈ దారిలో నడిచే వాహనాలు లారీలు, ఆటోలు, బస్సులు వాటి ఆయుర్ధాయం తగ్గుపోతుందని వాహనచోదకులు వాపోతున్నారు. టైర్లు ఏడాదికే మార్చవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎందరో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా కనీసం మరమ్మతులు చేయడం లేదని స్థానికులు గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. అనకాపల్లి నుంచి  అచ్యుతాపురం- పూడి మడక రోడ్డు అవస్థలుపై ఈటీవీ ప్రతినిధి మరిన్ని వివరాలు.

ABOUT THE AUTHOR

...view details