ఆంధ్రప్రదేశ్

andhra pradesh

roads issue in zp meeting kakinada

ETV Bharat / videos

Roads Issue in ZP Meeting Kakinada : రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం.. నేనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా : మంత్రి చెల్లుబోయిన - మంత్ర వేణుగోపాల్​రెడ్డి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 12:49 PM IST

roads issue in zp meeting kakinada : కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశంలో రోడ్లు, భవనాలశాఖపై చర్చ జరుగుతుండగా... రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నమాట వాస్తవమేనని, గతుకుల రోడ్డుతో తానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తరువాత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మండపేట-రామచంద్రాపురం రోడ్డు అధ్వానంగా ఉందని తెలిపారు. రోడ్డు బాగాలేని మాట వాస్తవమేనని..తాను కూడా అనపర్తి నుంచి రామచంద్రాపురం వచ్చేప్పుడు గతుకుల రోడ్డుతో ఇబ్బందిపడుతున్నానని చెప్పారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరారు. వీరితో పాటు సమావేశంలో పాల్గొన్న పలువురు వైసీపీ సభ్యులు తమ ప్రాంతాల్లోని రహదారుల సమస్యలను ప్రస్తావించారు.

road problems in andhrapradesh : కొత్తగా రోడ్లు వేయాలంటే రూ. కోట్లు కావాలని, ప్రతిపాదనల ఆమోదం, నిధుల మంజూరుకు సమయం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ లోపు మరమ్మతులు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బీసీ కులగణనకు సీఎం జగన్ జీవో జారీ చేశారని మంత్రి వేణు మీడియాకు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details