అన్నీ గుంతలే! రోడ్డు ఏది జగనన్నా? - వాహనచోదకులకు ప్రాణసంకటం - అవనిగడ్డ కోడూరు రహదారి తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 12:31 PM IST
|Updated : Dec 6, 2023, 2:45 PM IST
Roads Damage In Krishna District : కృష్ణా జిల్లా అవనిగడ్డలో రోడ్లు ఆధ్వాన స్థితికి చేరుకున్నాయి. అవనిగడ్డ- కోడూరు రహదారి వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రహదారిపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరి రోడ్లు మొత్తం బురదమయమవుతున్నాయి. రాకపోకలకు ఇంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు నిరాశ చెందుతున్నారు. ప్రమాదాల బారిన పడి అనేక మంది ఆస్పత్రుల పాలవతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ప్రయాణికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Avanigadda - kodure Road Problems : నాలుగేళ్లుగా రహదారికి ఇదే దుస్థితి కొనసాగుతోంది. దాదాపు పదమూడు గ్రామాలకు మార్గమైన ఈ రోడ్డుతో గ్రామస్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరమ్మతుల పేరులో నిధులు దండుకోవడం తప్ప రహదారి స్థితి అలాగే ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. అవనిగడ్డ - కోడూరు రహదారి దుస్థితిపై ఈ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేక కథనం.