Road Washed Out in Alluri District: కొట్టుకుపోయిన రోడ్డు.. స్తంభించిన జన జీవనం - గెమ్మిలి లోకల్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 8:23 PM IST
Road Washed Out in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయితీలోని కొన్ని గ్రామాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను గురి కావాల్సి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం పెద్దరాయి నుంచి జి.పెదబయలుకి 3 కిల్లో మీటర్లు మేర దూరం ఉంటుంది. ఈ గ్రామాలను గ్రావేల్తో వేసిన ఓ రోడ్డు కలుపుతుంది. శుక్రవారం కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గం అంతా వాగును తలపించింది. ఆ దారి పొడవున వరద పొంగి పొర్లింది. రోడ్డు కొట్టుకు పోవడంతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆ చుట్టూ పక్కన ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు తెలిపారు. దీని పై అధికారులు వెంటనే స్పందించి ఆ రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరారు.