ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Road_Accident_on_Hyderabad_Vijayawada_National_Highway

ETV Bharat / videos

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - యువతి మృతి, కారు దగ్ధం - mundlapadu car fired with short circuit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 3:49 PM IST

Road Accident on Hyderabad Vijayawada National Highway: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇవీ.. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

Car Burnt with Short Circuit in NTR District: ఈ ప్రమాదంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు వెంటనే స్పందించి కారు అద్దాలు పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తీశారు. అప్పటికే ఓ యువతి మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 అంబులెన్స్ సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. డివైడర్​పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసిపడినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details