ఆంధ్రప్రదేశ్

andhra pradesh

road_accident_at_anantapur_district

ETV Bharat / videos

కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బొలెరో - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - Road accidents in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 2:15 PM IST

Two People Died in Road Accident at Anantapur District:టమాటాలను రవాణా చేసే ఓ బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ.. ద్విచక్ర వాహనాన్ని, రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని.. ఇంకో కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో వెళ్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా పంపునూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామ శివారులో టమాటాలను రవాణా చేసే బొలెరో వాహనం వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, అలానే నడుచుకుంటూ వెళుతున్న వారిపై దూసుకెళ్లింది. అంతేకాదు ఎదురుగా వస్తున్న మరో కారును కూడా ఢీ కొట్టింది. 

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో మరణించిన వారి కుటుంబ సభ్యులు పంపనూరు జాతీయ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.  నిత్యం ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్​బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details