Guntur Road accident కుటుంబంలో విషాదం నింపిన రోడ్డు ప్రమాదం - పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురం
Road accident in Guntur tenali : గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి అనురాధ తన కుమారుడుతో కలిసి ద్విచక్రవాహనానం పై కొలకలూరు గ్రామానికి వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి అక్కడికి అక్కడే మృతి చెందారు. కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. కుమారుడు మణికంఠ అనారోగ్యంతో ఉన్న తన తల్లికి ఇంజెక్షన్ చేయించేందుకు వెంకట కృష్ణాపురం నుంచి కొలకలూరి గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు బయలుదేరాడు. దారి మధ్యలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం సైలెన్సర్‌ను లారీ ఢీ కొనడంతో కుమారుడు ఎడమ వైపు, తల్లి కుడి వైపు కిందపడిపోయారు. తల్లి కాళ్ల మీదుగా లారీ వెళ్లగా కాళ్లు నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు అనురాధకు భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.