ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Revenue_Minister_Dharmana_Prasad_Rao_Letter_to_CM_Jagan

ETV Bharat / videos

విశాఖలో వంద ఎకరాలు కేటాయించండి : సీఎం జగన్​కు ధర్మాన లేఖ - dharmana latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 5:09 PM IST

Revenue Minister Dharmana Prasad Rao Letter to CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్థిని కోరుతూ ఈరోజు(గురువారం) రెవెన్యూ శాఖా మంత్రి (Revenue, Registration Minister) ధర్మాన ప్రసాదరావు... ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రిజర్వు బ్యాంకు(Reserve Bank), ఇతర జాతీయ బ్యాంకుల జోనల్ కార్యాలయాలు, కెపీఎంజి(KPMG) లాంటి సంస్థలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రసాదరావు సీఎం జగన్​కు లేఖలో విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఫైనాన్షియల్ హబ్ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి  ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్​కు విన్నపం చేశారు.

Hundred Acres Allocate For Financial Hub: ఫైనాన్షియల్ హబ్ (financial Hub) ఏర్పాటుకు సంబంధించి విశాఖలో వంద ఎకరాల భూమిని కేటాయించాలని లేఖ ద్వారా మంత్రి కోరారు. రిజర్వ్‌ బ్యాంకు సహా ఆర్థిక సంస్థలు.. ఈ ఫైనాన్షియల్ హబ్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులకు సూచనలు చేయాలని సీఎంకు రాసిన లేఖలో మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details