ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Retired_IAS_EAS_Sarma_Comments_On_Rushikonda_Issue

ETV Bharat / videos

Retired IAS EAS Sharma Comments On Rushikonda Issue: "రుషికొండలో పర్యావరణ చట్టాల ఉల్లంఘన.. ప్రజాప్రతినిధులు చట్టాలకు అతీతులు కాదు"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 3:13 PM IST

Retired IAS EAS Sharma Comments On Rushikonda Issue :రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నది అందరి కంటే ముందుగానే గుర్తించి వాటిని నిరోధించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తెలిపారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగానే రుషికొండ ఒక పర్యాటక ప్రాంతంగానే ఉంచాలే తప్ప.. అక్కడ ఎటువంటి కార్యాలయాలు నిర్వహించరాదని చట్టం చెబుతోందని ఆయన వివరించారు. హైకోర్టులో కేసు నమోదు కాకముందే.. ఇక్కడ చట్ల ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పానని ఆయన గుర్తు చేశారు. రుషికొండ కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఉంటారన్న అంశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రజాప్రతినిధులు చట్టాలకు అతీతులు కాదని ఈఎఎస్ శర్మ తెలిపారు.

"రుషికొండలో పర్యావరణ చట్టాలను ఉల్లంఘించారు. అక్కడ బోర్​వెల్ వేయకూడదు. రుషికొండ ఒక పర్యాటక ప్రాంతంగానే ఉంచాలి. ప్రస్తుతం ఆఫీస్​లు, రిసార్టులు పెడతామని అంటున్నారు. అది తప్పు."- ఈఎఎస్‌ శర్మ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

ABOUT THE AUTHOR

...view details