ఆంధ్రప్రదేశ్

andhra pradesh

_rdo_Officer_resolve_issue_-of_voter_details_and_photos

ETV Bharat / videos

ఆ నియోజకవర్గంలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా - రెండు ఓట్లు ఉన్నవారికి నోటీసులు పంపిన ఆర్డీఓ - పల్నాడు జిల్లా బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 9:51 AM IST

RDO Resolve Issues Of voter details And photos:పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సుమారు 2వేల మంది ఓటర్ల వివరాలలో డబుల్‌ ఎంట్రీ, ఫోటో మార్పులు ఉన్నాయని ఆర్డీవో జి.వి రమణారెడ్డి (Gandra Venkata Ramanareddy) అన్నారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితాలో ఒకే రకమైన ఫొటో ఉన్న రెండు ఓట్లున్న 599 మందిని, ఒకే పేరు, చిరునామా గల 1267 మందిని గుర్తించి వారికి నోటీసులు అందచేశామని తెలిపారు. నోటీసు అందుకున్న వారు వివరణ ఇవ్వాలని కోరారు.

దీనిపై వివరణ కోరుతూ బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు నోటీసులు పంపించామని రమణారెడ్డి తెలిపారు. నిర్ణీత సమయంలో పోస్ట్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా గాని వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఎవరి ఓటును తొలగించబోమని ఆర్డీవో రమణారెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు సదురు ఓటర్లను సంప్రదించి వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. నోటీసులు ఇచ్చిన వెంటనే తొలగించడం లేదని వారి వివరణ తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details